- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో ఘోరం.. భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య
అమెరికా (America)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హెల్త్ టెక్నాలజీ స్టార్టప్ సహ-స్థాపకుడు, భారత సంతతికి చెందిన అక్షయ్ గుప్తా (Akshay Gupta) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 14న అక్షయ్ గుప్తా టెక్సాస్ (Texas)లోని క్యాపిటల్ మెట్రో బస్సులో వెళ్తుండగా.. దీపక్ కందేల్ (Deepak Kandel) అనే మరో భారతీయుడు అతడిపై పదునైన కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అక్షయ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు నిందితుడు దీపక్ కందేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అక్షయ్ గుప్తా గొంతులో కత్తి దింపిది తానేనని నిందితుడు ఒప్పుకున్నాడు. అతడు అక్షయ్ గుప్త అచ్చం తన మామయ్యను పోలి ఉన్నాడని.. అందుకే అతడిపై దాడి చేశానంటూ నిందితుడు దీపక్ కందేల్ పేర్కొన్నాడు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసిన టెక్సాస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.






