- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు వేయడానికి వెళుతూ.. ప్రమాదంలో ఇద్దరు మృతి
by Ramesh Naini |
ఓటు వేయడానికి వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు సాక్షులు చెబుతున్నారు. పోస్టుమార్టం కోసం వారి మృతదేహాలను జనగామకు తరలించారు. రెండో విడత పోలింగ్ కోసం ఓటు వేయడానికి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






