- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. రెండేళ్లుగా మైనర్ బాలుడిపై అత్యాచారం.. లిస్ట్‌లో ప్రభుత్వాధికారులు, నాయకులు కూడా..
కేరళలో దారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. కాసరగోడ్‌కు చెందిన పదహారేళ్ల బాలుడిపై రెండేళ్లుగా రేప్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పలు చోట్ల కేసులు నమోదు కాగా పదహారు మందిపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో గవర్నమెంట్ ఆఫీసర్స్,

దిశ, వెబ్ డెస్క్ : కేరళలో దారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. కాసరగోడ్‌కు చెందిన పదహారేళ్ల బాలుడిపై రెండేళ్లుగా రేప్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పలు చోట్ల కేసులు నమోదు కాగా పదహారు మందిపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో గవర్నమెంట్ ఆఫీసర్స్, స్థానిక రాజకీయ నాయకులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయగా.. మరో నలుగురికి కోసం వెతుకుతున్నారు పోలీసులు.
కాసరగోడ్‌లోని చందేరా ప్రాంతానికి చెందిన బాలుడు 2023లో ఎల్‌జీబీటీక్యూ డేటింగ్ యాప్(గ్రిండర్ యాప్)లో ఎకౌంట్ ఓపెన్ చేశాడు. ఈ క్రమంలో 23ఏళ్ల మొహమ్మద్ అఫ్సల్ అనే వ్యక్తితో మ్యాచ్ అయ్యాడు. ఇద్దరు క్లోజ్ అయిపోవడంతో అతన్ని బయటకు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. కానీ ఈ రెండేళ్ల సమయంలో కాసరగోడ్, కోజికోడ్, కన్నూర్, ఎర్నాకులం జిల్లాల్లో తిప్పుతూ లైంగికంగా హింసించాడు. దాదాపు పదహారు మంది అతన్ని రేప్ చేశారు. అయితే ఇంటికి పెద్ద పెద్ద వ్యక్తులు వస్తుండటంతో అనుమానం వచ్చిన బాలుడి తల్లి సెప్టెంబర్ 16న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివరాలన్ని బయటకొచ్చాయి. చైల్డ్ లైన్ కౌన్సిలింగ్ టైంలో బాలుడు 2023 నుంచి 2025 వరకు జరిగిన సెక్సువల్ వాయిలెన్స్ గురించి చెప్పాడు. దీంతో నాలుగు జిల్లాల్లో పోక్సో చట్టం కింత పదహారు కేసులు నమోదయ్యాయి. బాలుడిని వేధించిన వ్యక్తుల్లో 30 నుంచి 60ఏళ్ల వయసున్న వారు ఉన్నారని.. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది.






