ఊర్లోకి పులివచ్చిందంటూ ఏఐ ఫోటో చేసి ప్రచారం.. వ్యక్తి అరెస్ట్

by Ajay Maddhiboyina |

ఐ టెక్నాలజీతో గ్రామంలోకి పులి వచ్చినట్టు క్రియేట్ చేసి ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీసీ టౌన్ షిప్ లో జరిగింది.

ఊర్లోకి పులివచ్చిందంటూ ఏఐ ఫోటో చేసి ప్రచారం.. వ్యక్తి అరెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏఐ టెక్నాలజీతో గ్రామంలోకి పులి వచ్చినట్టు క్రియేట్ చేసి ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీసీ టౌన్ షిప్ లో జరిగింది. గత కొద్దిరోజులుగా జిల్లా పరిధిలో పెద్దపులి సంచరిస్తోంది. అయితే జిల్లాలోని అడవుల్లో, సింగరేణి ఓపెన్ కాస్ట్ వద్ద పులి సంచరిస్తుండటంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది.

ఈ నేపథ్యంలో సీసీసీ టౌన్ షిప్ లో పులి సంచరిస్తుంది అంటూ ఓ వ్యక్తి వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో కాస్త స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. దీంతో ప్రజలు బయపడిపోయారు. అటవీశాఖ అధికారులకు సైతం ఫిర్యాదులు అందాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నింధితుడిపై కేసులు నమోదు చేశారు. సీసీసీ టౌన్ షిప్‌లోకి పులి రాలేదని చెప్పారు. ఏఐతో వీడియోలు చేసి తప్పుడు ప్రచారం చేస్తే కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు.

Next Story