నీ ఫ్యామిలీని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో.. ప్రియురాలి ఒత్తిడి.. హతమార్చిన ప్రియుడు

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 15ఏ సమీపంలోని అమితాబ్ బచ్చన్ పార్క్‌లో మహిళ హత్య చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగి ఇరవై రోజులు కాగా తాజాగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. పెళ్లి అయి ఫ్యామిలీ ఉన్న దీపక్ ఈ మర్డర్ చేశాడని గుర్తించారు.

నీ ఫ్యామిలీని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో.. ప్రియురాలి ఒత్తిడి.. హతమార్చిన ప్రియుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 15ఏ సమీపంలోని అమితాబ్ బచ్చన్ పార్క్‌లో మహిళ హత్య చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగి ఇరవై రోజులు కాగా తాజాగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. పెళ్లి అయి ఫ్యామిలీ ఉన్న దీపక్ ఈ మర్డర్ చేశాడని గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మమత.. దీపిక్‌తో రొమాంటిక్ రిలేషన్‌లో ఉంది. అతని కుటుంబాన్ని వదిలేసి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అది సాధ్యం కాదని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో.. విసిగిపోయిన దీపక్ చంపడమే మార్గంగా ఎంచుకున్నాడు. కలుద్దామని మమతను పార్క్‌కు రప్పించి ప్లాన్ ప్రకారం మర్డర్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తానికి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Next Story