లోదుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్

by Disha Web Desk 13 |
లోదుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్
X

దిశ, శంషాబాద్ : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం బహ్రయిన్ నుండి (GF-274), షార్జా నుండి (6E-1406) ఇండిగో విమానంలో రెండు వేరువేరు విమానాల నుండి హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులు దిగారు. ఒక ప్రయాణికుడి నుండి 9 లక్షల 23 వేల విలువజేసే 176 గ్రాముల బంగారాన్ని లోదుస్తువులలో దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు.


మరో విమానంలో వచ్చిన ఇంకో ప్రయాణికుడి నుండి 13 లక్షల 73 వేల విలువజేసే 260 గ్రాముల బంగారాన్ని లేడీస్ హ్యాండ్ బ్యాగులో దాచిపెట్టి తరలిస్తుండగా పట్టుకున్నారు. మొత్తం ఇద్దరు ప్రయాణికుల వద్ద 23 లక్షల 73 వేల విలువచేసే 436 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుజరాత్‌లో రూ.1,026 కోట్ల డ్రగ్స్ స్వాధీనం..



Next Story

Most Viewed