- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో అక్రమ ఆయుధాల గుట్టురట్టు: ఇరాన్ ఏజెంట్‌గా వ్యవహరించిన మహిళ అరెస్ట్
"అమెరికాలో షమీమ్ మాఫీ అనే మహిళను ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. ఇరాన్ నుంచి ఆమె సూడాన్‌కు డ్రోన్లు, బాంబులు సరఫరా చేసినట్లుగా గుర్తించారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా నుంచి ఇరాన్‌కు అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న భారీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ఎఫ్‌బీఐ (FBI) అధికారులు ఛేదించారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన ఇరాన్ మూలాలున్న మహిళ షమీమ్ మాఫీ (44)ని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఇరాన్ నుంచి 2013లో అమెరికాకు వలస వచ్చిన షమీమ్, 2016లో అమెరికా గ్రీన్ కార్డ్ పొందింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని వుడ్‌ల్యాండ్ హిల్స్‌లో నివసిస్తోంది. ఇరాన్ రక్షణ శాఖ, విదేశీ దేశాల మధ్య మధ్యవర్తిగా ఉంటూ ఈమె ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మొహజెర్-6 (Mohajer-6) రకానికి చెందిన సాయుధ డ్రోన్ల సరఫరా కోసం సుమారు రూ.580 కోట్ల భారీ ఒప్పందంలో ఈమె కీలక పాత్ర పోషించింది.
సూడాన్‌కు బాంబుల సరఫరా..
గతంలో అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్‌కు ఇరాన్ నుంచి 55,000 బాంబ్ ఫ్యూజ్‌లను, లక్షలాది రౌండ్ల మందుగుండు సామాగ్రిని సరఫరా చేసినట్లు ఎఫ్‌బీఐ విచారణలో తేలింది. అమెరికా నిఘా సంస్థల కళ్లుగప్పేందుకు ఒమన్‌లో ‘అట్లాస్ ఇంటర్నేషనల్’ అనే నకిలీ కంపెనీని ఏర్పాటు చేసి, దాని ద్వారా టర్కీ, యూఏఈ మార్గాల్లో ఆయుధాలను రవాణా చేసేది. 2022 నుంచి 2025 మధ్య షమీమ్ ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో వాట్సాప్ ద్వారా నిరంతరం టచ్‌లో ఉన్నట్లుగా ఫోన్ రికార్డులు బయటపెట్టాయి. తన కొడుకు మిలిటరీ సర్వీస్ మినహాయింపు వంటి వ్యక్తిగత పనుల కోసం కూడా ఆమె ఇరాన్ అధికారుల సహాయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించి ఆయుధాల సరఫరాకు పాల్పడినందుకు ఆమెకు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.






