ibomma: ఎట్టకేలకు అసలు సీక్రెట్ రివీల్ చేసిన ఐబొమ్మ రవి

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-12 15:16:59  IST  )

ఐబొమ్మ పూర్తి పేరు.. ఇంటర్నల్ బొమ్మగా రవి పోలీసులకు తెలిపారు. అప్‌లోడ్ చేసిన సినిమాలన్నీ టెలీగ్రామ్ నుంచి తీసుకున్నట్లు తెలిపారు.

ibomma: ఎట్టకేలకు అసలు సీక్రెట్ రివీల్ చేసిన ఐబొమ్మ రవి
X

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ రవి(ibomma Ravi) రెండో విడత కస్టడీ ముగిసింది. శనివారం నాటి విచారణలో ఐబొమ్మ రవి సంచలన విషయాలు వెల్లడించారు. ఓటీటీలో వచ్చే ప్రతీ సినిమాను రికార్డింగ్ చేసినట్లు అంగీకరించారు. సినిమా రికార్డింగ్ చేసిన ఆడియోలు, వీడియోల క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పైరసీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గురించి కూడా పోలీసులకు వివరించారు.

ఐబొమ్మ పూర్తి పేరు.. ఇంటర్నల్ బొమ్మగా పేర్కొన్నారు. అప్‌లోడ్ చేసిన సినిమాలన్నీ టెలీగ్రామ్ నుంచి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం రవి ఈమెయిల్ అకౌంట్స్‌ రిట్రైవ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్స్‌లో 21వేలకు పైగా సినిమాలను గుర్తించారు. పైరసీ వెబ్‌సైట్స్ నుంచి సినిమాలు రికార్డింగ్ చేసినట్టు గుర్తించారు. ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డింగ్ చేసినట్టు రవి అంగీకరించినట్లు తెలిసింది. కస్టడీ ముగియడంతో మళ్లీ నాంపల్లి కోర్టుకు రవి తరలించారు.

Next Story