- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ పార్టీలో ఐఏఎస్ కుమారుడు.. టెస్టుల్లో పాజిటివ్!
గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కొండాపూర్‌లోని క్వాక్ ఎరీనా పబ్‌లో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. ముఖ్యంగా, సమాజంలో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఒక మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు ఈ డ్రగ్స్ పార్టీలో దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. పబ్‌లో జరిగిన సోదాల సమయంలో పోలీసులు ఎవరినీ వదలకుండా అనుమానితులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. మొత్తం 64 మందికి పరీక్షలు చేయగా, అందులో మహిళా ఐఏఎస్ కుమారుడికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. డ్రగ్స్ వినియోగించినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ కావడంతో పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల యాక్షన్..
పాజిటివ్ వచ్చిన ఐఏఎస్ కుమారుడితో పాటు మరో ఏడుగురిని పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. నిబంధనలు అతిక్రమించి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్న పబ్ యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






