శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 12 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

by Malleboina Mahesh |

శంషాబాద్ ఎయిర్ పోర్టు రోజువారీ తనిఖీల్లో భాగంగా ఓ మహిళా బ్యాగ్ చెక్ చేయగా.. పెద్ద ఎత్తున గంజాయి కనిపించింది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 12 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల గత కొద్ది కాలంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport)లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి, గోల్డ్, డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబడుతున్న విషయం తెలిసిందే. కస్టమ్స్ అధికారులు రోజుకు ఒక్కరినైనా పట్టుకుని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. అయినప్పటికి అక్రమార్జనపై ఉన్న ఆశతో ఇతరుల మాటలు నమ్మి.. విదేశాల నుంచి అక్రమంగా గంజాయి, డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ (Smuggling) చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే శంషాబాద్ ఎయిర్ పోర్టు శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రోజువారీ తనిఖీల్లో భాగంగా ఓ మహిళా బ్యాగ్ చెక్ చేయగా.. పెద్ద ఎత్తున గంజాయి కనిపించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బ్యాగును పూర్తి స్థాయిలో చెక్ చేయగా..దుబాయ్ నుంచి తీసుకొచ్చిన 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic cannabis) లభ్యం అయింది. దాని విలువ మార్కెట్లో రూ. 12 కోట్ల ఉంటుంది. అనంతరం దుబాయ్ నుంచి వచ్చిన ఆ మహిళను విచారించిన పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Next Story