హైదరాబాద్‌లో దారుణం.. తమిళ అమ్మాయిపై గ్యాంగ్ రేప్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-12 17:07:49  IST  )

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad)లో సంచటన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు యువతిని కిరాతకంగా రేప్ చేశారు.

హైదరాబాద్‌లో దారుణం.. తమిళ అమ్మాయిపై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad)లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు యువతిని కిరాతకంగా రేప్ చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్‌(Bachupalli Police Station) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై(Chennai)లో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని నమ్మించి అజయ్ అనే యువకుడు హైదరాబాద్‌కు పిలిపించాడు. హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని లేడీస్ హాస్టల్లో ఉంటున్న సదరు యువతిని పార్టీ చేసుకుందామని, తన స్నేహితుడు హరి ఫ్లాట్‌కు రావాలని రిక్వెస్ట్ చేశాడు. అజయ్ పిలుపు మేరకు నిజాంపేటలో రాజీవ్ గృహకల్పలోని హరి ఫ్లాట్‌కు వెళ్లింది. ఫ్లాట్‌కు వెళ్లిన తర్వాత యువతికి బలవంతంగా మద్యం తాగించి, మత్తులోకి వెళ్లగానే అజయ్, హరి ఇద్దరూ కలిసి ఆమెను రేప్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click For Twitter Post .....

Next Story