Hyderabad: నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌(Hyderabad)‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు(Nampally Criminal Court) సంచలన తీర్పు వెలువరించింది.

Hyderabad: నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు(Nampally Criminal Court) సంచలన తీర్పు వెలువరించింది. నలుగురిని పెట్రోల్‌ పోసి చంపిన ముద్దాయికి మరణశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడ(Narayanaguda)లో నాగులు సాయిలు, ఆర్తి అనే దంపతులు పూల వ్యాపారం చేసేవారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఆర్తి భర్తకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని వెళ్లిపోయింది.

అనంతరం నాగరాజు అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదని సాయిలు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పలుమార్లు ఆమెను మందలించాడు. అయినా వినకపోవడంతో వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఇద్దరిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో పది నెలల చిన్నారి సైతం తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. 2022లో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా కోర్టు నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Next Story