- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంఎంటీఎస్ అత్యాచార ఘటన ఫేక్.. విచారణలో షాకింగ్ విషయాలు
ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో షాకింగ్ నిజాలు భయటపడ్డాయి. అనంతపురం జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్‌లో ఉంటూ స్విగ్గీలో ఉద్యోగం చే

దిశ, వెబ్ డెస్క్: ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో షాకింగ్ నిజాలు భయటపడ్డాయి. అనంతపురం జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్‌లో ఉంటూ స్విగ్గీలో ఉద్యోగం చేస్తోంది. గత నెల 22న ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ రాగా తిరిగి మార్చి 22న ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం జరగటంతో రైలు నుండి దూకేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే విచారణ జరిపించారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో ప్రముఖ నేతలు సైతం యువతిని పరామర్శించారు. అయితే విచారణలో మాత్రం షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అత్యాచారమే జరగలేదని పోలీసులు నిర్దారించారు.
ఇన్ స్టాలో రీల్స్ చేస్తుండగా యువతి రైలు నుండి జారిపడ్డినట్టు పోలీసుల విచారణలో తేలిసింది. 250 సీసీ కెమెరాలను పరిశీలించినప్పటికీ, 100 మంది అనుమానితులను సైతం విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో పోలీసులు యువతిని ప్రశ్నించగా నిజం అంగీకరించినట్టు తెలుస్తోంది. రీల్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ రైలు నుండి కింద పడినట్టు యువతి చెప్పడంతో పోలీసులు కేసును క్లోజ్ చేశారు. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక గతంలోనూ రీల్స్ పిచ్చితో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఘటనల్లో ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. కాబట్టి ప్రమాదకరంగా ఉండే ప్రాంతాల్లో రీల్స్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






