హైదరాబాద్‌: అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

by Gantepaka Srikanth |

నగరంలోని అంబర్‌పేట్ పరిధిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్‌పేట్ చే నెంబర్ కూడలి వద్ద ఉన్న మహీంద్రా షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

హైదరాబాద్‌: అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని అంబర్‌పేట్ పరిధిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్‌పేట్ చే నెంబర్ కూడలి వద్ద ఉన్న మహీంద్రా షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షోరూమ్ నుండి మంటలు భారీగా ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాద తీవ్రతను గమనించిన షోరూమ్ సిబ్బంది, సమీపంలోని నివాసితులు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో షోరూమ్‌లో కార్లతో పాటు ఇతర విడిభాగాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.

రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది..

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టం మరియు ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం పోలీసులు మరియు ఫైర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story