- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: దేవుడు పిలుస్తున్నాడంటూ.. ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య
by Gantepaka Srikanth |
హైదరాబాద్(Hyderabad)లోని అంబర్‌పేట్(Amberpet)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని అంబర్‌పేట్(Amberpet)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మూఢకమ్మకాలతో మొత్తం కుటుంబం బలవన్మరణం(Family Suicide) చెందింది. కొన్ని రోజులు క్రితం పెద్ద కుమార్తె అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి తమను కూడా దేవుడు పిలుస్తున్నాడంటూ స్థానికులకు కుటుంబ సభ్యులు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఇవాళ తాము కూడా పెద్ద కుమార్తె దగ్గరకు వెళ్తున్నామంటూ సూసైడ్ లెటర్ రాసి మిగిలిన కుమార్తెతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పెద్ద కుమార్తె మరణం అనంతరం రాంనగర్ నుంచి అంబర్‌పేట్‌కు షిఫ్ట్ అయినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






