- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HCA జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్
హెచ్‌సీఏ(Hyderabad Cricket Association) అవకతవకల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హెచ్‌సీఏ(Hyderabad Cricket Association) అవకతవకల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ దేవరాజ్(Devaraj)ను శుక్రవారం సాయంత్రం సీఐడీ అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో ఉన్నాడన్న పక్కా సమాచారంతో అక్కడికు వెళ్లి అరెస్ట్ చేశారు. దేవరాజు అరెస్ట్‌తో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఇదిలా ఉంటే.. గంట క్రితమే ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు సహా పలువురు మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్‌ను మల్కాజ్‌గిరి కోర్టు(Malkajgiri Court) విచారించింది. హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాస్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జగన్ మోహన్ రావును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.






