హైదరాబాద్ లో సెలబ్రిటీ కొకైన్ దందా.. గుట్టు రట్టు చేసిన టీజీనాబ్

by Bhanu |

హైదరాబాద్ డ్రగ్స్ దందాను విస్తరించేందుకు వచ్చిన నైజీరియన్ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు బయటపెట్టారు.

హైదరాబాద్ లో సెలబ్రిటీ కొకైన్ దందా.. గుట్టు రట్టు చేసిన టీజీనాబ్
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ డ్రగ్స్ దందాను విస్తరించేందుకు వచ్చిన నైజీరియన్ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు బయటపెట్టారు. సోమవారం టీజీనాబ్ అధికారులు దాదాపు 1.25 కోట్ల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని నైజీరియన్ ను అరెస్టు చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...నైజీరియా దేశానికి చెందిన రోమియో ఆదేశాల మేరకు మెడికల్ వీసా మీద 2013 నుంచి 2022 వరకు 2 కోట్లు విలువ చేసే డ్రగ్స్, 2023 నుంచి జులై వరకు కోటి రూపాయాలు విలువ చేసే డ్రగ్స్, 2025 జనవరి నుంచి తాజాగా అరెస్టైన వరకు ఇమ్మాన్యూల్ బెడియకో మరో 5 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ను ఇండియాలో విక్రయించినట్లు గుర్తించి, టీజీ నాబ్ అధికారులు అతనిని సోమవారం సైనిక్ పురిలో అరెస్టు చేశారు.

అతని నుంచి 1.25 కోట్లు విలువ చేసే సెలబ్రిటీ కొకైన్, ఎక్సటసీ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మూడు సార్లు ఇండియాకు నైజీరియా, గనా దేశాలకు సంబంధించిన పాసుపోర్టు ల మీద ఇమ్మాన్యూల్ బెడియకో వచ్చి ఈ దందాను నైజీరియాలో ఉంటూ అపరేట్ చేస్తున్న రోమియో ఆదేశాల మేరకు డ్రగ్స్ దందాను చేస్తన్నట్లు ఇమ్మాన్యూల్ బెడియకో టీజీనాబ్ అధికారుల విచారణలో బయటపెట్టారు. గోవాలో విలాసవంతమైన విల్లాలు, ఇండిపెండెంట్ ఇండ్లను అద్దెకు తీసుకుని వాటిలో ఉంటు ఈ డ్రగ్స దందాను చేస్తు్న్నట్లు వివరించాడు. ఖరీదైన సెలబ్రిటీ కొకైన్, గ్రాము ధర 25 వేలు, ఎక్సటసీ పిల్స్ ఒకటి 6 వేల చొప్పున అమ్ముతు భారీగా సంపాదిస్తున్నారడు. ఇలా 20 శాతం కమీషన్ రూపంలో సంపాదించిన సొమ్మును ఇమ్మాన్యూల్ బెడియకో దాదాపు 1.60 కోట్ల డబ్బును హవాలా మార్గంలో నైజీరియాలో ని వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి పంపినట్లు టీజీనాబ్ అధికారులు గుర్తించారు.

ముంబాయిలో ఉన్న హవాలా అపరేటర్ , మరో నైజీరియన్ తో కలిసి దాదాపు 150 బ్యాంక్ లావాదేవిల్లో ఈ డబ్బును పంపించినట్లు పోలీసుు గుర్తించారు. తాజాగా హైదరాబాద్ లో ఈ డ్రగ్స్ దందాకు పెద్ద మార్కెట్ గా తయారైందని అక్కడికి వెళ్ళి దందా చేయాలని చెప్పడంతో ఇమ్మాన్యూల్ బెడియకో హైదరాబాద్ సైనిక్ పురి ప్రాంతానికి డ్రగ్స్ తో వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న టీజీనాబ్ అధికారులు ఇమ్మాన్యూల్ బెడియకోను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రోమియో, సన్నీలు పరారీలో ఉన్నారు.

సెక్యురిటీ గార్డు నుంచి డ్రగ్స్ స్మగ్లర్ గా

నైజీరియాకు చెందిన ఇమ్మాన్యూల్ బెడియకో కు మొత్తం నలుగురు అన్నదమ్ములు, నలుగు అక్కాచెల్లెలు, చదువును మధ్యలోనే వదిలేసి ఓ కంపెనికి సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ డబ్బు సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాడు. నైజీరియాలో తన ఇంటి సమీపంలో ఉంటున్న రోమియో ఇండియా నుంచి వస్తున్నప్పుడల్లా భారీగా డబ్బులు, ఖరీదైన వస్తువుల తో వస్తుండడంతో అతనిని ఆరా తీశాడు. తాను గోవాలో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు చెప్పాడు. తన వద్ద పని చేస్తే నీకు కూడా భారీగా కమీషన్ లు వస్తాయని విలాసవంతంగా బతుకువచ్చని చెప్పాడు.

దీంతో ఇమ్మాన్యుల్ ఒకే అనడంతో అతనిని 2013 లో ఇండియాలోని బెంగళూరుకు మెడికల్ వీసా మీద తీసుకువచ్చి డ్రగ్స్ దందా చేయించాడు. ఇమ్మాన్యూల్ పేరును మాక్స్ వెల్ మార్చి ఆ పేరు మీద రోమియో డ్రగ్స్ దందాను ప్రారంభించాడు. అలా ఇమ్మాన్యూల్ డ్రగ్స్ దందాలో మాక్స్ వెల్ గా ముద్రవేసుకుని గత 10 సంవత్సరాలుగా గోవా కేంద్రంగా డ్రగ్స్ దందాను చేస్తున్నాడు. ఇలా డ్రగ్స్ దందా చేస్తు ఇమ్మాన్యుల్ మూడు సార్లు నైజీరియా వెళ్ళి వచ్చాడు. ఇలా రోమియో గ్యాంగ్ లో ఉన్న ఇమ్మాన్యూల్ దాదాపు 8 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను గోవా, బెంగళూరు తో పాటు ఇంకా అనేక ప్రాంతాల్లో కొకైన్, ఎక్సటసీ పిల్స్, ఎండిఎంఏ మత్తు పదార్ధాలను అమ్మేశాడు. తాజాగా హైదరాబాద్ పై గురి పెట్టి దొరికిపోయాడు.



Next Story