- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : విషాదం.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి
మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు బాలింతలు మృతి చెందారు.

X
దిశ, వెబ్ డెస్క్: మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు బాలింతలు మృతి చెందారు. కాగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు మృతి చెందారని బాధితులు మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆపరేషన్ వికటించడం కారణంగా మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యం చేసిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Next Story






