నోరా ఫతేహిలా తయారు కావాలని తిండి పెట్టకుండా భర్త టార్చర్.. అబార్షన్ కూడా చేయించడంతో.. భరించలేక

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-21 04:36:00  IST  )

ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఫిజికల్ ఎడ్యకేషన్ టీచర్ అయిన భర్త.. భార్యను నోరా ఫతేహిలా తయారు కావాలని టార్చర్ చేస్తున్న ఘటన షాక్ ఇస్తోంది. మీరట్‌కు చెందిన భర్త.. భార్యపైనే కాదు అత్తామామలను కూడా బాడీ షేమ్ చేస్తూ, వేధింపులకు

నోరా ఫతేహిలా తయారు కావాలని తిండి పెట్టకుండా భర్త టార్చర్.. అబార్షన్ కూడా చేయించడంతో.. భరించలేక
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఫిజికల్ ఎడ్యకేషన్ టీచర్ అయిన భర్త.. భార్యను నోరా ఫతేహిలా తయారు కావాలని టార్చర్ చేస్తున్న ఘటన షాక్ ఇస్తోంది. మీరట్‌కు చెందిన భర్త.. భార్యపైనే కాదు అత్తామామలను కూడా బాడీ షేమ్ చేస్తూ, వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేసింది భార్య. రోజూ మూడు గంటలు జిమ్‌లో వర్కవుట్ చేయాలని బలవంతం చేస్తున్నాడని.. చేయని రోజున తిండి పెట్టకుండా టార్చర్‌కు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన అందానికి నోరా ఫతేహి లాంటి హీరోయిన్‌‌ను పెళ్లి చేసుకోవాల్సింది కానీ నీలాంటి దరిద్రాన్ని కట్టుకోవాల్సి వచ్చిందని నోటికి వచ్చిన బూతులు తిడుతున్నాడని బాధపడింది.

అంతేకాదు పెళ్లి సమయంలో కట్నం కింద రూ. 75 లక్షలు, కారు, బంగారం ఇచ్చినప్పటికీ.. అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయని తట్టుకోలేకపోతున్నానని పోలీసులను ఆశ్రయించింది. తల్లి కాబోతున్నాననే సంతోషాన్ని పంచుకుంటే.. తనకు తెలియకుండా ట్యాబ్లెట్ పాలలో కలిపి ఇవ్వడంతో గర్భస్రావం అయిందని.. గాజియాబాద్ ఉమెన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story