- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి అయి పదిరోజులు.. భార్యను 30సార్లు కత్తితో పొడిచిన కానిస్టేబుల్.. రక్తపు మడుగులో కొట్టుకుంటున్నా వదలకుండా.. చివరికి..
ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కిరాతకంగా హతమార్చాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ గామా నిషాద్‌కు జిల్లా కోర్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న మాయ వృత్తిపరంగా ప్రతిరోజూ కలుసుకునేవారు. ఈ పరిచయమే ప్రేమగా

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కిరాతకంగా హతమార్చాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ గామా నిషాద్‌కు జిల్లా కోర్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న మాయ వృత్తిపరంగా ప్రతిరోజూ కలుసుకునేవారు. ఈ పరిచయమే ప్రేమగా మారింది. ఇద్దరు ఆగస్టు 2న కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఓ అద్దె ఇంట్లో కొత్తగా కాపురం పెట్టారు. కానీ మాయ ఇతరులతో మాట్లాడుతుందనే అనుమానంతో తరుచూ గొడవపడేవాడు గామా.
ఈ క్రమంలోనే ఆగస్టు 11న కూడా గొడవ అయింది. కానీ ఘర్షణ తీవ్రత పెరిగింది. అర్ధరాత్రి అయిన గొడవ కంటిన్యూ కాగా ఈ కోపంలో గామా కూరగాయల కత్తితో దాడికి దిగాడు. దాదాపు 30సార్లు భార్యను కత్తితో పొడిచాడు. దీంతో మాయ అత్యధిక రక్తస్రావంతో రక్తంలో పడి కొట్టుకుంటున్నా వదలకుండా దాడి చేస్తూనే ఉన్నాడు. భారీ శబ్దాలు వినపడటంతో ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ ఆలోపే మాయ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు అక్కడకు వచ్చేసరికి రక్తపు మడుగులో మాయ.. చేతితో కత్తిలో గామా ఉండగా.. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.






