ఫేస్ బుక్ వాడుతుందని భార్యను గొడ్డలితో నరికిన భర్త

by Sujitha Rachapalli |

బిహార్‌లోని ఎరారి కంచన్‌పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఫేస్ బుక్ వాడుతుందని భార్యను గొడ్డలితో నరికి చంపాడు భర్త. అక్టోబర్ 30న దివ్యా కుమారి(27) ఫేస్ బుక్‌లో చాట్ చేస్తుండగా.. భర్త అభిషేక్ కుమార్ వ్యతిరేకించాడు.

ఫేస్ బుక్ వాడుతుందని భార్యను గొడ్డలితో నరికిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్ : బిహార్‌లోని ఎరారి కంచన్‌పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఫేస్ బుక్ వాడుతుందని భార్యను గొడ్డలితో నరికి చంపాడు భర్త. అక్టోబర్ 30న దివ్యా కుమారి(27) ఫేస్ బుక్‌లో చాట్ చేస్తుండగా.. భర్త అభిషేక్ కుమార్ వ్యతిరేకించాడు. దీంతో ఇద్దరి మధ్య వాదన మొదలై.. హింసాత్మకంగా మారింది. అనుమానం, కోపంతో రాత్రి మళ్లీ మళ్లీ కొట్టాడు. అతని తండ్రి రవి రంజన్ కూడా గొడవలో భాగం కాగా చివరకు గొడ్డలితో నరికి చంపడంతో ఎండ్ అయింది. ఆమె చనిపోయిందని పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో.. అక్కడకు చేరుకున్న దివ్య తండ్రి మనోజ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కు పంపించారు. పరారీలో ఉన్న నిందితులను ఇద్దరిని పట్టుకుంటామని తెలిపారు. అభిషేక్ దివ్యను కొట్టడం మొదటిసారి కాదని.. ఇప్పటికే అతనిపై మర్డర్ కేు, రేప్ కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు.

Next Story