భర్తను కొడవలితో నరికి చంపిన భార్య.. రెండు నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్‌కు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-10 02:17:53  IST  )

మధ్యప్రదేశ్ నర్మదాపురం జిల్లాలో భర్తను కొడవలితో గొంతు కోసం చంపింది భార్య. నిందితురాలు సేవంతిబాయి పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని రూ. 500 అప్పుగా తీసుకుంది. అయితే భర్త ఆ డబ్బును తీసుకుని మద్యం సేవించడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

భర్తను కొడవలితో నరికి చంపిన భార్య.. రెండు నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్‌కు..
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ నర్మదాపురం జిల్లాలో భర్తను కొడవలితో గొంతు కోసం చంపింది భార్య. నిందితురాలు సేవంతిబాయి పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని రూ. 500 అప్పుగా తీసుకుంది. అయితే భర్త ఆ డబ్బును తీసుకుని మద్యం సేవించడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాగిన మత్తులో రాత్రంతా భార్యతో గొడవపడ్డాడు. ఉదయం నాలుగు గంటల సమయంలో నిద్రలోకి జారుకున్నాక.. మెడపై కొడవలితో దాడి చేసి హత్య చేసింది. ఇంటి పక్కనే ఉన్న పొలంలో మృతదేహాన్ని విసిరేసింది. తన భర్త ఎక్కడికో వెళ్లాడని.. ఉదయాన్నే తన పుట్టింటికి వెళ్తున్నానని.. బస్సు ఎక్కి వెళ్లిపోయింది.

అయితే ఉదయం పదకొండు గంటల సమయంలో పొలం యజమాని మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం నిందితురాలి కోసం గాలించగా.. నలుగురు పిల్లలతో కలిసి తల్లి ఇంట్లో దాక్కున్నట్లు గుర్తించారు. పోలీసులను చూడగానే ఏడుపు మొదలుపెట్టిన ఆమె నేరాన్ని ఒప్పుకుంది. పిల్లలను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. కాగా ఆమె రెండు నెలల బిడ్డతో ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Read More..

అర్ధరాత్రి ముగ్గురు అమ్మాయిలతో పాడు పని.. యువకుడిని పట్టుకుని చితకబాదిన స్థానికులు

Next Story