ఇన్‌స్టా నకిలీ ఐడీతో భార్యకు వలపు వల: కిలాడీ వేషాలతో భర్త కటకటాల్లోకి!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-06 06:06:40  IST  )

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి కట్టుకున్న భార్యను భయభ్రాంతులకు గురిచేసిన భర్త కటకటాల పాలయ్యాడు.

ఇన్‌స్టా నకిలీ ఐడీతో భార్యకు వలపు వల: కిలాడీ వేషాలతో భర్త కటకటాల్లోకి!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా (Social Media) మోజులో పడి కొందరు ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటూ ఉంటే.. మరికొందరు కటకటలాపాలవుతున్నారు. ప్రస్తుతం అచ్చం అలాంటి ఉదంతమే ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య ప్రవర్తనను పరీక్షించాలనుకున్నాడో లేక ఆమెను వేధించాలనుకున్నాడో తెలియదు కానీ, ఓ భర్త స్వయంగా నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ క్రియేట్ చేసి తన భార్యకే వలుపు వల విసిరి బుట్టలో వేసుకోవాలని చూశాడు. చివరకు ఆ వ్యవహారం కాస్తా పోలీసుల వరకు వెళ్లడంతో భర్త కటకటాల పాలయ్యాడు.

ఇన్‌స్టాలో నకిలీ ప్రోఫైల్ క్రియేట్..

పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలు తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో ఓ అపరిచిత వ్యక్తి నుంచి మెసేజ్‌లు రావడం గమనించింది. సదరు వ్యక్తి నకిలీ ప్రొఫైల్ ఉపయోగించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం చేస్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన మహిళ భర్తకు చెప్పకుండా నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు రంగంలోకి దిగి ఆ నకిలీ ఇన్‌స్టా ఐడీ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో ఆరా తీశారు. ఐపీ అడ్రస్ (IP Address), మొబైల్ లొకేషన్ (Mobile Location) ఆధారంగా విచారించగా, ఆ అపరిచిత వ్యక్తి మరెవరో కాదు, సదరు మహిళ సొంత భర్త అని తేలడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు.

భార్యకు బెదరింపులు..

అయితే, భర్త ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తన భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, ఆమెతో చాటింగ్ మొదలుపెట్టాడు. ఆమెను ట్రాప్ చేయడమే కాకుండా, మాట వినకపోతే ఇబ్బందులకు గురిచేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నారు. తన భార్య ఇతర వ్యక్తులతో చాట్ చేస్తుందా.. లేదా? అని చెక్ చేయడానికే తాను ఇలా చేశానని నిందితుడు చెబుతున్నట్లుగా సమాచారం.

తొమ్మిది మందితో కి‘లేడీ’ పెళ్లిళ్లు.. ‘లూటర్ బ్రైడ్’ స్కామ్ వెలుగులోకి

Next Story