- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగుళూరులో దారుణం.. పాదరసంతో భార్య ప్రాణం తీసిన భర్త
భార్యపై కోపం పెంచుకున్న భర్త బతికుండగానే జీవచ్చవంలా మారేలా చేసి చివరికి ప్రాణం తీశాడు. ఈ దారుణ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. బసవరాజు, విద్య దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరగ్గా వీరు బెంగుళూరులోని అత్తిబెలెలో నివాసం ఉంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భార్యపై కోపం పెంచుకున్న భర్త బతికుండగానే జీవచ్చవంలా మారేలా చేసి చివరికి ప్రాణం తీశాడు. ఈ దారుణ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. బసవరాజు, విద్య దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరగ్గా వీరు బెంగుళూరులోని అత్తిబెలెలో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా కుటుంబ కలహాలతో భార్యను చంపేయాలని భావించిన భర్త ఆమెకు పాదరసాన్ని ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి అవయవాలన్నీ పాడెయ్యాలా చేసి హతమార్చాడు.
తొమ్మిది నెలల క్రితం బసవరాజు ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ లో పనిచేసే సౌమ్య అనే మహిళ, ఆమె భర్త సహాయంతో ఈ పనిచేశాడు. మొదట భార్యతో ప్రేమగా మాట్లాడుతూ ఆమెకు తెలియకుండా మత్తులోకి జారుకునేందుకు క్లోరోఫామ్ ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తరవాత పాదరసాన్ని ఆమె శరీరంలోకి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చాడు. తరవాత రోజు విద్య స్పృహలోకి రాగా ఆమె తొడ భాగం పూర్తిగా ఉబ్బిపోయింది.
లేవలేని పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లగా చికిత్స అందించిన వైద్యులు ఆమె శరీరంలో పాదరసం ఇంజెక్ట్ చేసినట్టు గుర్తించారు. నెమ్మదిగా పాదరసం కారణంగా ఆమె శరీరంలోని అవయవాలు అన్నీ పాడవ్వగా తొమ్మిది నెలలు నరకం అనుభవిస్తూ చివరికి కన్నుమూసింది. విద్య మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.






