భర్తను మోసం చేసిన భార్య.. భార్యను కడతేర్చిన భర్త.. అనాథలైన ఇద్దరు పిల్లలు!

by Gantepaka Srikanth |

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎంతో అన్యోన్యంగా ఉండాల్సింది పోయి ప్రాణాలు తీసేలా ప్రవర్తించి కుటుంబం చిన్నాభిన్నమై అభం శుభం తెలియని చిన్న పిల్లలు అనాథలుగా మారిన ఘటన వరంగల్ ఏనుమాముల పరిధి బాలాజీ నగర్‌లో జరిగింది.

భర్తను మోసం చేసిన భార్య.. భార్యను కడతేర్చిన భర్త.. అనాథలైన ఇద్దరు పిల్లలు!
X

దిశ, వరంగల్ టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎంతో అన్యోన్యంగా ఉండాల్సింది పోయి ప్రాణాలు తీసేలా ప్రవర్తించి కుటుంబం చిన్నాభిన్నమై అభం శుభం తెలియని చిన్న పిల్లలు అనాథలుగా మారిన ఘటన వరంగల్ ఏనుమాముల పరిధి బాలాజీ నగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రితీష్ సింగ్ గత 15 ఏండ్ల క్రితం వరంగల్‌కు బతుకు తెరువు కోసం వచ్చాడు. ఇక్కడే బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి బాలాజీ నగర్‌కు చెందిన రేష్మా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొమ్మల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. మధ్యలో కొంత కాలానికి ఆ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి.

రితీష్ సింగ్ ఫ్రెండ్ వీరి మధ్య గొడవలకు కారణమయ్యాడు. అతని మయమాటలకు లొంగిపోయిన రేష్మా, రితీష్ సింగ్ లేనప్పుడల్లా అతనితో కలిసేది. నాలుగు నెలల క్రితం చంటి పిల్లలను వదిలి అతనితో వెళ్ళిపోయింది. ఇటు భార్య చేసిన అఘాయిత్యానికి పరువు పోయి మరోపక్క చిన్నపిల్లల బాగోగులు చూసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎలాగోలాగా భార్యను బతిమిలాడి ఒప్పించి తీసుకువచ్చాడు. అప్పటికే ఆమె మూడు నెలల గర్భం దాల్చదంతో అబార్షన్ చేయించాడు. ఇటీవల నాలుగు రోజుల క్రితం వారు బాలాజీ నగర్‌కు వచ్చారు.

బాగానే ఉంటున్నారని బంధువులు, ఆ ఏరియా పెద్దమనుషుల అనుకునేలా అన్నారు. ఉన్నట్టుండి గురువారం రాత్రి రేష్మా నిద్రిస్తున్న సమయంలో ఆమె భర్త రితీష్ సింగ్ కళ్లు, చేతులు మంచానికి కట్టేసి గొంతు నులిమి చంపేసి పారిపోయాడు. తెల్లవారినా కూడా ఎంతకీ నిద్రలేవక పోవడంతో రేష్మా తల్లి ఇంటికి వచ్చి చూసింది. రేష్మా చనిపోయిందని గుర్తించింది. దీంతో రేష్మా తల్లి స్థానిక ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రితీష్ సింగ్ కోసం గాలిస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా ఇద్దరు పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరు లేకుండా పోయి అనాథలుగా మారారు.

Next Story