దారుణం.. కార్పొరేటర్‌ను నరికి చంపిన భర్త

by Naga Rani Yarlagadda |

తమిళనాడులోని అవడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై.. కార్పొరేటర్‌ను భర్త నరికి చంపాడు.

దారుణం.. కార్పొరేటర్‌ను నరికి చంపిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని అవడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై.. కార్పొరేటర్‌ను భర్త నరికి చంపాడు. భార్యను చంపిన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అవడి జిల్లా విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) కౌన్సిలర్ గోమతి (Corporator Gomathi Murder) తిరునిన్రావూర్ ప్రాంతంలోని జయరామ్ నగర్ సమీపంలో మరొకవ్యక్తితో నిలబడి మాట్లాడుతుండటాన్ని భర్త స్టీఫెన్ రాజు చూశాడు. ఆ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అతనితో వివాహేతర సంబంధం (Extra Marital Affair) ఉందని స్టీఫెన్ రాజు (Stephen Raju) గొడవపడటంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. కోపంలో స్టీఫెన్ రాజు కత్తితో గోమతిపై పదే పదే దాడి చేశాడు. కత్తిపోట్లకు తీవ్ర రక్తస్రావం కావడంతో గోమతి అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. అనంతరం తనకు తానుగానే స్టీఫెన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, గోమతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Next Story