- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో భార్యను చంపాడు.. ఫీల్ అయ్యాడు.. అందుకే మొదటి భార్యను కూడా..
నార్త్ కరోలినాకు చెందిన తిమోతి టేలర్ డబుల్ మర్డర్‌లో దోషిగా నిర్ధారించబడ్డాడు. 22ఏళ్ల జైలు శిక్ష విధించబడి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అతను హత్య చేసిన ఇద్దరు మరెవరో కాదు ఆయన భార్యలే. ముందుగా మే 13, 2023లో తిమోతి రెండో

దిశ, వెబ్ డెస్క్ : నార్త్ కరోలినాకు చెందిన తిమోతి టేలర్ డబుల్ మర్డర్‌లో దోషిగా నిర్ధారించబడ్డాడు. 22ఏళ్ల జైలు శిక్ష విధించబడి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అతను హత్య చేసిన ఇద్దరు మరెవరో కాదు ఆయన భార్యలే. ముందుగా మే 13, 2023లో తిమోతి రెండో భార్యను చంపినట్లు తెలుస్తోంది. అప్పటికే ఆమెతో డేటింగ్‌లో ఉన్న ఆయన ఆమెను పెళ్లి చేసుకుని కేవలం నెల రోజులు మాత్రమే అవుతుంది. పైగా ఆమె అప్పుడు గర్భవతి కూడా. ఆ తర్వాత రెండో భార్యను చంపినందుకు చాలా ఫీల్ అయిపోయిన తిమోతి.. ఈమె కన్నా తన మొదటి భార్యను చంపడం బెటర్ అని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి మొదటి భార్య తన పిల్లలతో నివాసముంటున్న న్యూయార్క్‌కు వెళ్లాడు. ఓ రోజు హోటల్‌లో స్టే చేసిన ఆయన.. మే 28న అంటే ఎగ్జాక్ట్‌గా రెండో భార్యను చంపిన పదిహేను రోజులకు.. మొదటి రాత్రి భార్య ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అయి దాదాపు 22 సార్లు కత్తితో పొడిచి చంపాడు. కిటికీలో నుంచి పారిపోతూనే రక్తంతో తడిసిన బట్టలను వదిలేశాడు. ఆ తర్వాత హోటల్‌కు వెళ్లి అక్కడి నుంచి చెక్ ఇన్ చేసి పారిపోయాడు. ఈ క్రమంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పారిపోతున్న తిమోతిని పట్టుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. రెండేళ్లుగా జరుగుతున్న ట్రయల్‌లో తాజాగా ఆయనకు కోర్టు 22ఏళ్ల జైలు శిక్ష విధించింది.






