రోడ్డు ప్ర‌మాదంలో భ‌ర్త మృతి.. భార్య‌కు తీవ్ర గాయాలు

by Ratna Kumari |

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్య తీవ్రంగా గాయాల‌పాలైన సంఘ‌టన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని గొల్లపల్లి శివారులో లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

రోడ్డు ప్ర‌మాదంలో భ‌ర్త మృతి.. భార్య‌కు తీవ్ర గాయాలు
X

దిశ, జగదేవపూర్ : రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్య తీవ్రంగా గాయాల‌పాలైన సంఘ‌టన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని గొల్లపల్లి శివారులో లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (58), లక్ష్మి భార్యాభర్తలు ఇద్దరూ తమ వ్యక్తిగత పని నిమిత్తం జగదేవపూర్ కు వెళ్లారు. అక్కడ పని ముగించుకొని సొంత గ్రామం గొల్లపల్లికి ఆటోలో బయలుదేరి వచ్చారు. గ్రామ సమీపంలోని తమ వ్యవసాయ పొలం వద్ద ఉన్న గేదెలను ఇంటికి కొట్టుకు రావడానికి ఆటో నుంచి దిగి ఇద్దరు రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో గొల్లపల్లి నుండి జగదేవపూర్ వైపు అజాగ్రత్తగా వెళుతున్న యాక్టివా స్కూటీ (నెం. TG-36-A-0394) భార్యాభర్తలు ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మల్లయ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. లక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, స్కూటీ నడిపిన జిల్లా అనిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story