పుట్టింటికి వెళ్లిన భార్య.. భర్త ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

భార్య భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకే మనస్తాపం చెంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. భార్య పుట్టింటికి వెళ్లి 15 రోజులైనా రాకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

పుట్టింటికి వెళ్లిన భార్య.. భర్త ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: భార్య భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకే మనస్తాపం చెంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. భార్య పుట్టింటికి వెళ్లి 15 రోజులైనా రాకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ మారుతీ నగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుందరమతి దుర్గారావు(35) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 15 రోజుల క్రితం అతని భార్య.. పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఇద్దరి మధ్య ఏవో మనస్పర్థలు తలెత్తడంతో ఆమె అక్కడే ఉందని చెప్తున్నారు. భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో సుందరమతి మనస్తాపంతో శనివారం రాత్రి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story