మంట కలిసిన మానవత్వం..మీరాలం ట్యాంక్‌లో నెలలు నిండని శిశువు మృతదేహం

by Chintha Aamani |

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది.

మంట కలిసిన మానవత్వం..మీరాలం ట్యాంక్‌లో నెలలు నిండని శిశువు మృతదేహం
X

దిశ, రాజేంద్రనగర్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది. నెలలు నిండని శిశువు మృతదేహం మీరాలం ట్యాంక్ లో స్థానికులకు కనిపించడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిరాలం ట్యాంక్ లో నెలలు నిండని శిశువు మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అత్తాపూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

మృత శిశువు నాలుగు నెలల వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృత శిశువు మృతదేహం కనిపించడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వం మంట కలిసిపోయిందని ఆందోళన చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు అత్తాపూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును ఫోన్లో పలుమార్లు సంప్రదించగా ఆయన స్పందించలేదు.

Next Story