- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత
by Naga Rani Yarlagadda |
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది. నిందితుల నుంచి మూడు కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద తనిఖీల్లో రూ.3 కోట్ల విలువైన 9 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు ముషీరాబాద్ లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జె.ఆర్.ప్రదీప్ నుంచి విజయ్ కుమార్ హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 367 గ్రాముల హాష్ ఆయిల్, ఒక బైక్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






