ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ గంజాయి సీజ్.. ఇద్దరు నిందితులు అరెస్ట్

by Kema Shiva Kumar |

బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ.కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ గంజాయి సీజ్.. ఇద్దరు నిందితులు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి సీజ్ చేసిన ఘటన బెంగళూరు (Bengaluru)లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)లో చోటుచేసుకుంది. విదేశాల నుంచి నగరానికి గంజాయి వస్తుందనే సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు బ్యాంకాక్ నుంచి బెంగళూరు‌కు హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic Cannabis)ని తీసుకొస్తున్న కమ్మనహళ్లికి చెందిన శఫీవుద్దీన్ షేక్ (34) అతడి భార్య సారా సిమ్రాన్ (26)గా అదుపులోకి తీసుకున్నారు. వీరు అంతర్జాతీయ డ్రగ్ ముఠాకు కీలక రవాణాదారులుగా పనిచేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది.

కాగా, పోలీసులు వారి నుంచి మొత్తం 18.59 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి, ఆహార పదార్థాల ప్యాకింగ్‌లో దాచి బ్యాక్‌ప్యాక్‌ల ద్వారా తరలించే ప్రయత్నం చేశారు. పట్టుబడిన హైడ్రోఫోనిక్ గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.18.60 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కెంపెగౌడ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి నిందితులు బయటకు వచ్చినప్పటికీ, పక్కా సమాచారంతో మాహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు వీరిని వెంబడించి పోలీసులు పట్టుకున్నారు.

Next Story