ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 16 మంది అక్కడికక్కడే దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-25 05:10:43  IST  )

ఇటీవల వరుస ప్రమాదాలు అగ్రరాజ్యం అమెరికా (America)ను కుదిపేస్తున్నాయి.

ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 16 మంది అక్కడికక్కడే దుర్మరణం
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఇటీవల వరుస ప్రమాదాలు అగ్రరాజ్యం అమెరికా (America)ను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ టెన్నెసీ (Tennessee) స్టేట్‌లోని హంఫ్రెయ్స్, హిక్మన్ కౌంటీల సరిహద్దులో ఉన్న బక్స్నోర్ట్ (Bucksnort) ప్రాంతంలో అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 7:48 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ (AES) ఫ్యాక్టరీలో జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ (Accurate Energetic Systems) ఫ్యాక్టరీ సైనిక, ఏరోస్పేస్, కమర్షియల్ భవనాలకు కూల్చివేతకు సంబంధించిన సంస్థలకు పేలుడు పదార్థాలు, టీఎన్‌టీ వంటి ప్రొడక్టులు సప్లయ్ చేస్తున్నట్లుగా సమాచారం.

Read More: ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు

Next Story