Huge Explosion: డోలమైట్‌ గనిలో భారీ పేలుడు.. నలుగురికి తీవ్రగాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-05 08:49:46  IST  )

ఓ గనిలో పేలుడు కారణంగా నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన అనంతపురం జిల్లా (Anantapur District)లో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Huge Explosion: డోలమైట్‌ గనిలో భారీ పేలుడు.. నలుగురికి తీవ్రగాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ గనిలో పేలుడు కారణంగా నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన అనంతపురం జిల్లా (Anantapur District)లో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దవడుగూరు (Peddavaduguru) మండల పరిధిలోని కొండుపల్లి (Kondupalli)లో డోలమైట్ గని (Dolomite Mine)లో కార్మికులు ఉదయం నుంచి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు కార్మికులకు తీవ్ర గాయలయ్యాయి. ఈ మేరకు గని వద్ద ఉన్న కార్మికులు వారిని చికిత్స నిమిత్తం యాడికి (Yadiki)లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, భూగర్భ గనిలో పేల్చేందుకు నిప్పు పెడుతుండగా ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ పేలుడుకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story