షాకింగ్.. తెలంగాణలో భారీగా కొకైన్ సీజ్

by Gantepaka Srikanth |

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేయాలని ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ లభ్యమవుతున్నాయి.

షాకింగ్.. తెలంగాణలో భారీగా కొకైన్ సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేయాలని ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ లభ్యమవుతున్నాయి. తాజాగా సోమవారం నాడు తెలంగాణ నార్కోటిక్(Telangana Narcotics Bureau), నార్సింగి పోలీసులు(Narsingi Police) జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు రూ.30 లక్షల విలువైన కొకైన్‌ను(Cocaine) స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవలే డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం, పోలీసులు కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని డీజీపీ జితేందర్‌ వెల్లడించారు. తెలంగాణ యాంటీ డ్రగ్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాలతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని విలువైన జీవితం, ఆరోగ్యం కోల్పోతారని వివరించారు. భావి భారత పౌరులుగా ఈ సందేశాన్ని పది మందికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.

Next Story