వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ సీజ్.. నలుగురిపై కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-04 05:00:54  IST  )

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రజలకు ప్రాణం పోయాల్సిన వైద్యుడే డ్రగ్ డెన్‌ను నడుపుతున్న ఘటన నగర పరిధిలో చోటుచేసుకుంది.

వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ సీజ్.. నలుగురిపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రజలకు ప్రాణం పోయాల్సిన వైద్యుడే డ్రగ్ డెన్‌ను నడుపుతున్న ఘటన నగర పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ (Musheerabad)కు చెందిన డాక్టర్ జాన్‌పాల్ (John Paul) తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ముగ్గురు స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్‌తో కలిసి డ్రగ్స్ దందాను మొదలుపెట్టారు. ఏకంగా ఢిల్లీ (Delhi), బెంగళూరు (Bengaluru), గోవా (Goa) నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో అమ్ముతున్నారు. అయితే, విషయం తెలుసుకున్న ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై బాలరాజు (SI Balaraju) టీమ్ డాక్టర్ జాన్‌పాల్ ఇంట్లో ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో 26.95 గ్రాముల ఓజీ కుష్, 6.21 గ్రాముల ఎండీఎంఏ, 15 ఎల్ఎస్‌డీ బ్లాట్స్, 1.32 గ్రాముల కొకైన్, 5.80 గ్రాముల గుమ్మస్, 0.008 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3 లక్షల విలువ ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు డాక్టర్ జాన్‌పాల్‌ను అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు నిందితులు ప్రమోద్, సందీప్, శరత్ పరారీలో ఉన్నారని.. వారిపై కూడా కేసు నమోదు చేశామని ఎస్సై బాలరాజు తెలిపారు.

Next Story