- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంఫాల్ లో పలు ఇళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
by Javid Pasha |

X
ఇంఫాల్ : మణిపూర్ లో మళ్ళీ హింసాకాండ చోటుచేసుకుంది. రాజధాని ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ఏరియా సమీపంలో హింస చెలరేగింది. కుకీ తెగకు చెందిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నెమ్చా కిప్‌జెన్ అధికారిక నివాసానికి దుండగులు బుధవారం నిప్పు పెట్టారు. దానిపై గురువారం మధ్యాహ్నం కుకీ తెగకు చెందిన పలువురు ఇంఫాల్‌లో ఆందోళనకు దిగారు. కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ఆందోళనలకు అనుమతిలేదని భద్రతా దళాలు చెప్పినా వినిపించుకోలేదు.
కొందరు నిరసనకారులు భద్రతా బలగాలతో ఘర్షణ పడ్డారు. ఈనేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేటందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈక్రమంలో పలువురు ఆందోళనకారులు కొన్ని ఇళ్లకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పారు.
Next Story