65 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

by Taduka Kalyani |

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నంది కంది గ్రామం 65 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

65 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నంది కంది గ్రామం 65 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 65 నెంబర్ జాతీయ రహదారి పై ప్రయాణిస్తున్న ఓ ఆటో అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. జహీరాబాద్ వద్ద దర్గాను దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్కల్ మండలానికి చెందిన లావణ్య, మనూరు మండలానికి చెందిన రుక్మిణి మరి కొందరితో కలిసి ఆటోలో జహీరాబాద్ సమీపంలోని ఓ దర్గా కు వెళ్లారు. అక్కడ పూజలు ముగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story