- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కర్ణాటక వాసులు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక వాసులు దుర్మరణం పాలైన విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తి (Wanaparthy) జిల్లా కొత్తకోట మండల పరిధిలోని ముమ్మల్లపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్నారు. ముమ్మల్లపల్లి వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ లారీ, వారి బొలేరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బొలేరోలో ప్రయాణిస్తున్న ఒకరు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ పరిస్థితి విషమించడంతో వారు కూడా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అనంతరం డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.






