- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం, 35 మంది సురక్షితం
తిరుపతి జిల్లా తాల్వాయిపాడు జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలైన ఘటన తిరుపతి (Tirupati) జిల్లాలోని తాల్వాయిపాడు (Talvaipadu) జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఈ దుర్ఘటన ధాటికి బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయ్యింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు, వాహనదారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






