- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్ జిల్లాలో ఘోరం.. భార్యను కడతేర్చిన భర్త
భార్యను అతి కిరాతకంగా భర్త హతమార్చిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్/చర్లపల్లి: భార్యను అతి కిరాతకంగా భర్త హతమార్చిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోత్కూర్ మండలం అడ్డగూడూర్ గ్రామానికి చెందిన బోడ శంకర్ (40), భార్య మంజుల (35) భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, వారు నాలుగు రోజుల క్రితం మహేశ్ నగర్ కాలనీలో ఉంటున్న అక్క, బావ ఇంటికి కుటుంబంతో వచ్చారు. ఈ క్రమంలోనే శంకర్ అర్థరాత్రి అందరూ పడుకున్న సమయంలో కత్తితో విచక్షణారహితంగా భార్య మంజులపై దాడి పాల్పడ్డాడు. ఆమె అరుపుల శబ్ధానికి అందరు లేవడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం మంజుల రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






