- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచిర్యాల పట్టణంలో ఘోరం.. నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య
by Kema Shiva Kumar |
నడి రోడ్డుపై పట్టపగలు ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో గురువారం చోటుచేసుకుంది.

X
దిశ, మంచిర్యాల టౌన్ : నడి రోడ్డుపై పట్టపగలు ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని గోపాల్ వాడలో నివాసం ఉండే శరణ్య (23) స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే, శరణ్య గురువారం సాయంత్రం విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్, ఎసీపీ తిరుపతి రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఏ కారణం చేత శరణ్యను దుండగులు హతమార్చరనే విషయం ఇంకా తెలియరాలేదు.
Next Story






