ఇంజినీరింగ్ కాలేజీలో ఘోరం.. ఉరేసుకుని విద్యార్థి బలవన్మరణం

by Kema Shiva Kumar |

ఉరేసుకుని ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

ఇంజినీరింగ్ కాలేజీలో ఘోరం.. ఉరేసుకుని విద్యార్థి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉరేసుకుని ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్‌ (Guru Nanak Institutions Technical Campus) హాస్టల్‌ గదిలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాము (20) భవనంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, గమనించి తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు. అనంతరం పోలీసులకు విషయం చెప్పగా వారు స్పాట్ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

అయితే, ప్రాథమికంగా విద్యార్థి రాముది ఆత్మహత్యగా నిర్ధారించినప్పటికీ, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజా ఘటనతో కాలేజీ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, గతంలోనూ ఇదే కాలేజీ హాస్టల్‌లో 2025 మే నెలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని భావన (22) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మనకు తెలిసిందే.

Next Story