వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ కాలేజీలో ఘోరం.. లెక్చరర్ల వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-09 12:29:17  IST  )

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే రాక్షసుల్లా మారారు. క్రమశిక్షణ పేరుతో ఒక విద్యార్థిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, ఆమె మృతికి కారణరమైన దారుణ ఘటన నగరంలోని వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటుచేసుకున్న ఇవాళ చోటుచేసకుుంది.

వెస్ట్ మారేడుపల్లి  ప్రభుత్వ కాలేజీలో ఘోరం.. లెక్చరర్ల వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే రాక్షసుల్లా మారారు. క్రమశిక్షణ పేరుతో ఒక విద్యార్థిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, ఆమె మృతికి కారణరమైన దారుణ ఘటన నగరంలోని వెస్ట్మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఒక రోజు కాలేజీకి కొంచెం ఆలస్యంగా వచ్చింది. అదే సాకుగా తీసుకున్న ఇద్దరు మహిళా లెక్చరర్లు ఆమెను తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి నరకం చూపించారు. కాలేజీకి ఎందుకు లేటుగా వచ్చావు.. పీరియడ్స్ వచ్చాయా? నాటకాలు ఆడుతున్నావా.. ఏది చూపించు? అంటూ అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. విద్యార్థులందరి ముందు లెక్చరర్లు మాట్లాడిన మాటలకు విద్యార్థిని వర్షిణి తీవ్ర మనస్తాపానికి గురైంది.

డిప్రెషన్‌తో కుప్పకూలిన వర్షిణి..

కాలేజీలో జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేక విద్యార్థిని ఒక్కసారిగా పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ మాటలే గుర్తొచ్చి తీవ్ర మానసిక వేదన అనుభవించింది. ఈ క్రమంలో ఇంట్లోనే తలతిరిగి పడిపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మరోవైపు విద్యార్థిని మృతికి లెక్చరర్ల వేధింపులే కారణమని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కళాశాల ముందు భారీ ఆందోళన చేపట్టాయి. విద్యార్థినిని మానసికంగా వేధించిన మహిళా లెక్చరర్లను వెంటనే అరెస్టు చేసి సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story