ఏపీలో పరువుహత్య కలకలం..తన కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని చంపిన తల్లి?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-13 13:32:40  IST  )

ఏపీలోని అన‌కాప‌ల్లిలో దారుణం చోటు చేసుకుంది. త‌న కూతురిని ప్రేమించాడ‌ని మాజీ స‌ర్పంచ్ ఓ యువ‌కుడిని సుపారీ గ్యాంగ్‌తో కలిసి హత్య చేసింది. ఈ ఘటన అనకాపల్లిలోని దేవరపల్లి మండలం కాశీపురంలో చోటు చేసుకుంది.

ఏపీలో పరువుహత్య కలకలం..తన కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని చంపిన తల్లి?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని అన‌కాప‌ల్లిలో దారుణం చోటు చేసుకుంది. త‌న కూతురిని ప్రేమించాడ‌ని మాజీ స‌ర్పంచ్ ఓ యువ‌కుడిని సుపారీ గ్యాంగ్‌తో కలిసి హత్య చేసింది. ఈ ఘటన అనకాపల్లిలోని దేవరపల్లి మండలం కాశీపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు తమిళనాడులోని అరుణాచలంలో ఓ భవనంపై నుండి కిందపడి మరణించాడు. అయితే నవీన్ భవనంపై నుండి కిందపడి చనిపోలేదని అతడిని చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సమీప గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుమార్తె రూపతో ప్రేమలో ఉన్నాడని ఆమెతోనే అరుణాచలం వెళ్లాడని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైన్ టికెట్లు కూడా చూపిస్తున్నారు. టికెట్ లో నవీన్‌తో పాటు రూప మరియు ఆమె తల్లి చిన్ని పేర్లు ఉన్నాయి. దీంతో వాళ్లిద్దరే కలిసి ఓ సుపారీ గ్యాంగ్ సహాయంతో హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురుతో నవీన్ ఫోన్ మాట్లాడుతున్నాడని తెలిసే యువతి తల్లి చిన్ని అతడిని హత్య చేయాలని భావించినట్టు చెబుతున్నారు.

పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నవీన్‌కు బాడీపై తీవ్రగాయాలు ఉండటంతో ఇది పరువు హత్యనే అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది. అంతే కాకుండా సుపారీ గ్యాంగ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి యువతి తల్లి ఈ హత్య చేసిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తల్లీ కూతుళ్లు తమిళనాడు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేశామని విచారణ తరవాత వివరాలు వెళ్లడిస్తామని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

Next Story