- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్‌లో ఖిలాడీ దంపతులు.. ఇన్‌స్టాలో న్యూడ్ ఫోటోలతో వల విసిరి ఆపై ఇంటికి పిలిచి!
కరీంనగర్‌లో దంపతుల హనీట్రాప్ బాగోతం బట్టబయలు అయింది. ఓ జంట ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతూ వలపువల విసిరి ఆ తరవాత న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్‌లో దంపతుల హనీట్రాప్ బాగోతం బట్టబయలు అయింది. ఓ జంట ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతూ వలపువల విసిరి ఆ తరవాత న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోంది. దీనిపై బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు గతంలో మార్బుల్ వ్యాపారం చేయగా అందులో నష్టాలు రావడంతో డబ్బు సంపాదించేందుకు అడ్డదారి తొక్కారు. ప్రస్తుతం వీరిద్దరూ కరీంనగర్‌లోని ఆరెపల్లి వద్ద ఉంటున్నారు. దంపతులు న్యూడ్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి యువకులు, వ్యాపారులను ఆకర్షించారు.
తరవాత వారిని ఇంటికి పిలిచి వీడియోలు తీసి డబ్బులు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. సుమారు వందమంది వరకు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు. ఓ బాధితుడు ఖిలేడీ దంపతులకు ఏకంగా 12 లక్షలు ఇవ్వగా మరో రూ.5లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు యువకులను, వ్యాపారులను మోసం చేసి ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయడంతో పాటు, కారు కొనుగోలు చేసి లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్టు చెప్పారు. దంపతుల ఫోన్లలలో చాలా మంది న్యూడ్ వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.






