ఒక్క వీడియోకు పది లక్షలు.. న్యూడ్ వీడియోలతో బిజినెస్ చేస్తున్న బీజేపీ నేత

by Sujitha Rachapalli |

యూపీ ఆగ్రాలో మరో హనీ ట్రాప్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు పోలీసులు. పింకీ అనే మహిళ రన్ చేస్తున్న ఈ ముఠాలో బీజేపీ నేత మనీష్ షానీ కీలకంగా ఉన్నట్లు తెలిపిన పోలీసులు.. అతనితోపాటు విరాట్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సచిన్

ఒక్క వీడియోకు పది లక్షలు.. న్యూడ్ వీడియోలతో బిజినెస్ చేస్తున్న బీజేపీ నేత
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీ ఆగ్రాలో మరో హనీ ట్రాప్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు పోలీసులు. పింకీ అనే మహిళ రన్ చేస్తున్న ఈ ముఠాలో బీజేపీ నేత మనీష్ షానీ కీలకంగా ఉన్నట్లు తెలిపిన పోలీసులు.. అతనితోపాటు విరాట్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సచిన్ అనే వ్యక్తి న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించిన నిందితులు.. ఒకవేళ అలా జరగకూడదంటే రూ. 10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. పక్కా ప్లాన్‌తో నిందితులను పట్టుకున్నారు.

అసలు ఏం జరిగింది?

పింకీ ఫేస్ బుక్ మెసేంజర్ ద్వారా సచిన్‌తో మాట్లాడింది. జెయిన్ హాస్టల్‌లో మీట్ అవుదామని సూచించింది. దీంతో అతను వెళ్లి మీట్ అయ్యాడు. ఇద్దరు రూమ్‌లో ఉండగా.. న్యూడ్ వీడియో చిత్రీకరించారు మిగతా గ్యాంగ్ సభ్యులు. ఆ తర్వాత ఈ వీడియో చూపించి బెదిరించిన వారు.. పది లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సచిన్ పోలీసుల సహాయం కోరాడు.

Next Story