కొత్త ర‌కం హ‌నీ ట్రాప్.. ప్రేమ‌గా పిలిచింద‌ని వెళితే బ‌తుకు బ‌స్టాండే

by Ajay Maddhiboyina |

కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ జంట హనీట్రాప్ కు పాల్పడుతూ యువకుల వద్ద నుండి డబ్బులు, ఫోన్లు ఇతర ఖరీదైన వస్తువులను దొంగలిస్తోంది. ఓ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నింధితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు.

కొత్త ర‌కం హ‌నీ ట్రాప్.. ప్రేమ‌గా పిలిచింద‌ని వెళితే బ‌తుకు బ‌స్టాండే
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ జంట హనీట్రాప్ కు పాల్పడుతూ యువకుల వద్ద నుండి డబ్బులు, ఫోన్లు ఇతర ఖరీదైన వస్తువులను దొంగలిస్తోంది. ఓ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నింధితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. వివరాల్లోకి వెళితే... ఈ ఘ‌ట‌న‌ కేరళలోని పతనంతిట్ట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జ‌యేష్ ఆయ‌న భార్య రేష్మి హ‌నీట్రాప్ కు పాల్ప‌డుతూ యువ‌కుల‌ను మోసం చేస్తున్నారు. ర‌ష్మి ఓ 19ఏళ్ల యువ‌కుడికి వ‌ల విసిరి అత‌డితో ప‌రిచ‌యం పెంచుకుంది.

త‌ర‌వాత ప్రేమ‌గా మాట్లాడి అతడిని ఇంటికి ఆహ్వానించింది. వెళ్లిన యువ‌కుడిపై ర‌ష్మి భ‌ర్త జ‌యేష్ క‌త్తి, సైకిల్ చైన్ తో దాడి చేసి ర‌ష్మితో రొమాంటిక్ యాంగిల్స్ లో ఫోటోలు దిగాల‌ని ఒత్తిడి చేశాడు. ఆ త‌ర‌వాత డ‌బ్బు, బంగారం దోచుకుని బ‌ట్ట‌లు చింపేసి రోడ్డుపై నెట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని క్రైమ్ క‌పుల్ ను అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో మ‌రో యువ‌కుడిని సైతం దంపతులు టార్గెట్ చేసి దోచుకున్న‌ట్టు తేలింది. అత‌డిపై పెప్పెర్ స్ప్రేతో దాడి చేసి ఐఫోన్ లాక్కున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. నేరం రుజువు అవ్వ‌డంతో ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేసి జైలుకు పంపించారు.

Next Story