గొడవ తరువాత ఇంటి నుంచి వెళ్లిన హోం గార్డ్.. మిస్సింగ్ కేసు నమోదు

by Bhanu |   (  Updated:2025-07-18 03:24:12  IST  )

వనపర్తి జిల్లాలో హోంగార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. వనపర్తి పట్టణానికి చెందిన పసుపుల జయలక్ష్మి (39) ఇచ్చిన ఫిర్యాదు

గొడవ తరువాత ఇంటి నుంచి వెళ్లిన హోం గార్డ్.. మిస్సింగ్ కేసు నమోదు
X

దిశ, వనపర్తి : వనపర్తి జిల్లాలో హోంగార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. వనపర్తి పట్టణానికి చెందిన పసుపుల జయలక్ష్మి (39) ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు వనపర్తి ఎస్సై హరిప్రసాద్ వివరాలు తెలిపారు.

ఆత్మకూర్ మండలంలోని తెలంగాణ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న బీచుపల్లి (42) బుధవారం తన ఇంటినుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని భార్య జయలక్ష్మి పోలీసులకు తెలిపింది. దంపతుల మధ్య జరిగిన గొడవ అనంతరమే ఆయన ఇంటిని వదిలి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story