- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధి నిర్వహణలో హోంగార్డు కన్నుమూత..
by Bhanu |
విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ హఠాత్తుగా గుండెపోటుకు గురై

X
దిశ, నాగార్జునసాగర్: విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. విధి నిర్వహణకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన కిషన్, మార్గమధ్యంలో అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో తానే స్వయంగా సమీపంలోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు.
అయితే అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ వర్గాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కిషన్ మృతికి గల పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అధికారులు కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
Next Story






